నిజంనిప్పులాంటిది

Feb 19 2024, 08:36

Tirumala: నేడు తిరుమల శ్రీవారి మే నెల టికెట్లు విడుదల

నేడు తిరుమల శ్రీవారి మే నెల టికెట్లు విడుదల కానున్నాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల మే నెల కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది..

సేవా టికెట్ల ఎలక్ట్రానిక్‌ డిప్‌ కోసం 21న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. లక్కీడిప్‌ టికెట్లు పొందినవారు అదే రోజు మ.12లోపు రుసుము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాలని టీటీడీ అధికారులు వెల్లడించారు.

ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార, కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, వర్చువల్‌ సేవా టికెట్ల కోటాను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు, వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్ల మధ్యాహ్నం 3 గంటలకు,

అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్‌లైన్‌ కోటాను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ నెల 24న మే నెల ప్రత్యేక ప్రవేశ దర్శన రూ.300 టికెట్లు కోటాను విడుదల చేయనున్నారు..

నిజంనిప్పులాంటిది

Feb 18 2024, 16:52

వచ్చే వంద రోజులు ఎంతో కీలకం: ప్రధాని మోదీ

ఢిల్లీ: బీజేపీ కార్యకర్తలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల రెండోరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు..

పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడుతున్నారని మోదీ అ‍న్నారు. వచ్చే వంద రోజులు ఎంతో కీలకమని తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారంతా 18వ లోక్‌సభ ఎన్నికలకు ఓటు వేయబోతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని మోదీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు బీజేపీ గెలుస్తుందని మోదీ తెలిపారు. సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాసే బీజేపీ లక్ష్యమని ఆయన గుర్తుచేశారు. పార్టీ శ్రేణలు ప్రతి ఇంటికి, ప్రతి ఓటరు వద్దకు చేరుకోవాలని సూచించారు. నవ భారత్‌ నిర్మాణం కోసం అందరం కలిసి పనిచేద్దామని పీఎం మోదీ అన్నారు. గత పదేళ్లలో దేశ రూపరేఖలు మారాయని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ భారీ మేజార్టీతో మళ్లీ అధికారంలోకి రాబోతోందని తెలిపారు..

ఈ పదేళ్లలో అవినీతి రహిత పాలన అందించాని.. ఇంకా చాలా నిర్ణయాలు తీసుకోవల్సి ఉందన్నారు. తనకు రాజకీయాలు ముఖ్యం కాదని.. దేశమే ముఖ్యమని మోదీ అన్నారు. విపక్ష నేత కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 400 స్థానాలు వస్తాయని అంటున్నారని తెలిపారు. దేశంలో ప్రభుత్వాలు మారుతుంటాయి..

నిజంనిప్పులాంటిది

Feb 14 2024, 13:49

Bandla Ganesh : మరో సారి చెక్ బౌన్స్ కేసులో నిర్మాత బండ్ల గణేష్ కు జైలు శిక్ష

ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత బండ్ల గణేష్ కు బిగ్ షాక్ తగిలింది. ఓ చెక్‌బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు ఆయనకు సంవత్సరం జైలు శిక్ష విధించింది..

జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ తీర్పుకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే ఆయనకు గతంలో ఎర్రమంజిల్ కోర్టు కూడా ఆరునెలల జైలు శిక్ష విధించింది.

టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు జైలు శిక్షతో పాటు రూ.15,86, 550ల జరిమానా కూడా విధించింది..

25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు కోర్ట్ ఈ శిక్ష విధించింది. వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న గణేష్ కు షరతులతో కూడిన బెయిల్ ను న్యాయస్థానం మంజూరు చేసింది.

బండ్ల గణేష్ మొదట చిన్న చిన్న పాత్రలు చేస్తూ టాలీవూడ్ లో సినీ కెరీర్ ను ప్రారంభించాడు. పలు సినిమాల్లో కీలక పాత్రలు చేసాడు. ‘ఆంజనేయులు’ సినిమా ద్వారా నిర్మాతగా మారాడు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ స్థాపించి ‘ఇద్దరమ్మాయిలతో’, ‘గబ్బర్ సింగ్’, ‘బాద్షా’, ‘టెంపర్’ వంటి చిత్రాలు నిర్మించాడు..

నిజంనిప్పులాంటిది

Feb 14 2024, 13:47

Bharat Jodo Nyay Yatra: జార్ఖండ్‌లో భారత్‌ జోడో న్యాయ యాత్ర రద్దు

రాహుల్ గాంధీ రెండో దశ భారత్ జోడో న్యాయ యాత్ర బుధవారం జార్ఖండ్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా, ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం కారణంగా రద్దయ్యింది..

రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఢిల్లీ వెళ్లారని, అందుకే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి..

పంజాబ్ రైతులు తమ డిమాండ్లు నెరవేరేందుకు ఢిల్లీలో నిరసనలు చేపడుతున్నారు. కాగా బుధవారం రాహుల్ గాంధీ ఛత్తీస్‌గఢ్‌లోని గర్వా జిల్లా నుంచి జార్ఖండ్‌లో అడుగుపెట్టాల్సి ఉంది.

అయితే రైతుల ఆందోళన దృష్ట్యా జార్ఖండ్‌లో భారత్ జోడో న్యాయ యాత్ర కార్యక్రమాన్ని రద్దు చేశామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సోనాల్ శాంతి తెలిపారు. రైతుల ఆందోళన అనంతరం ఈ యాత్రను పునఃప్రారంభిస్తామని తెలిపారు..

నిజంనిప్పులాంటిది

Feb 14 2024, 11:05

Farmer's Protest Updates: శంభు సరిహద్దులో ఉద్రిక్తత.. రెండో రోజూ అదే పరిస్థితి?

రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం ఇంకా సమసిపోలేదు. కనీస మద్దతు ధరకు సంబంధించిన కొత్త చట్టానికి సమ్మతించని రైతులు ఢిల్లీకి పాదయాత్రగా తరలివచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు..

ఈరోజు (బుధవారం) తిరిగి ఢిల్లీలో అడుగుపెట్టేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వారంతా ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంభు సరిహద్దులో వేచిచూస్తున్నారు. దీంతో శంభు సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది

రైతుల ఆందోళనల నేపధ్యంలో హర్యానాలోని ఎనిమిది జిల్లాల్లో ఫిబ్రవరి 15 వరకు ఇంటర్నెట్ నిలిపివేశారు. మంగళవారం హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో రైతుల 'ఢిల్లీ చలో' మార్చ్‌ను ప్రభుత్వం అడ్డుకుంది.

ఫతేఘర్ సాహెబ్ నుంచి శంభు సరిహద్దు వరకూ గుమిగూడిన రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. సింగూ బోర్డర్, టిక్రీ బోర్డర్, ఘాజీపూర్ బోర్డర్‌లో గట్టి పోలీసు నిఘా కొనసాగుతోంది..

నిజంనిప్పులాంటిది

Feb 14 2024, 11:03

ఏపీకి రిలయ్స్‌, బిర్లా భారీ పెట్టుబడులు.. నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్‌

నేడు వర్చువల్‌గా సీఎం జగన్‌ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

రూ.1,700 కోట్లతో ఆదిత్య బిర్లా కార్బన్‌ బ్లాక్‌ మానుఫ్యాక్చర్‌ ఫెసిలిటీ 

రూ.1,024 కోట్లతో రిలయన్స్‌ బయోగ్యాస్‌ ప్లాంట్లు

పలు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ప్రారంభం 

మొత్తం 10 కంపెనీలు..రూ.4,883 కోట్ల పెట్టుబడులు

4,046 మందికి ఉద్యోగాలు

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగ అభివృద్ధిలో మరో కీలక ఘట్టానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు శ్రీకారం చుడుతున్నారు.

రిలయన్స్‌ బయో ఎనర్జీ, ఆదిత్య బిర్లా గ్రూప్‌తోపాటు పలు సంస్థలు రాష్ట్రంలో నెలకొల్పుతున్న పరిశ్రమలకు ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు..

నిజంనిప్పులాంటిది

Feb 14 2024, 11:01

Sonia Gandhi: రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ.. నేడే నామినేషన్ దాఖలు

Rajya sabha elections: కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ఇవాళ రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను దాఖలు చేయబోతున్నారు..

నామినేషన్ దాఖలు చేసేందుకు సోనియా గాంధీ ఈరోజు ఉదయం జైపూర్ కు వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి..

సోనియా గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ కంచుకోటగా ఉంది.

2004 ఎన్నికల నుంచి 2019 ఎన్నికల వరకు సోనియా గాంధీ వరుసగా రాయ్‌బరేలీలో విజయం సాధించారు..

నిజంనిప్పులాంటిది

Feb 14 2024, 10:59

నేటి నుంచి మేడారం మహాజాతర పూజలు

మేడారం మహాజాతర ప్రత్యేక పూజలు బుధవారం ప్రారంభం కానున్నాయి. మండమెలిగే పండగ పేరుతో నిర్వహించే ఈ ఉత్సవంతో జాతర ప్రారంభమైనట్లు పూజారులు భావిస్తారు..

ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో నిర్వహించే ఈ వేడుక బుధవారం ఉదయం నుంచి గురువారం వేకువజాము వరకు జరుగుతుంది. మేడారంలోని సమ్మక్క దేవత పూజామందిరం, కన్నెపల్లి సారలమ్మగుడి, పూనుగొండ్ల, కొండాయి గ్రామాల్లో పగిడిద్దరాజు, గోవిందరాజు ఆలయాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి..

పూర్వకాలంలో ఈ గుడుల స్థానంలో గుడిసెలు ఉండేవి. రెండేళ్లకు ఇవి పాతబడి పోవడంతో.. పూజారులు అడవికి వెళ్లి మండలు(చెట్టుకొమ్మలు), వాసాలు, గడ్డి తీసుకువచ్చి దేవుళ్లకు కొత్తగా గుడిని నిర్మించి పండగ జరుపుకొనేవారు.

దీనినే మండమెలిగే పండగగా పేర్కొంటారు. పూజారులందరూ ఆచారం ప్రకారం తలో పనిచేసి పగలంతా మండమెలిగి, రాత్రంతా దేవతల గద్దెలపై జాగారం చేస్తారు..

నిజంనిప్పులాంటిది

Feb 13 2024, 15:32

చలో నల్లగొండ భారీ బహిరంగ సభకు బయలుదేరిన ఉరుమడ్ల బిఆర్ఎస్ నాయకులు, రైతులు

చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని ఈరోజు నల్లగొండలో నిర్వహించే కెసిఆర్ భారీ బహిరంగ సభకు ఉరుమడ్ల గ్రామం నుండి పెద్ద ఎత్తున తరలివెళ్లిన పార్టీ శ్రేణులు రైతులు కార్యకర్తలు.

టిఆర్ఎస్ ఉద్యమ సీనియర్ నేత జిల్లా నాయకులు పల్లపు బుద్ధుడు కృష్ణా నదిపై ప్రాజెక్టుల పెత్తనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం చేతుల్లో పెట్టిందని,

తెలంగాణను మళ్లీ ఎడారిగా మారొద్దంటే మన నీళ్లు, హక్కుల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని,

నల్లగొండ కెసిఆర్ సభకి పోటెత్తుదాం.. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను తిప్పికొడదాం అంటూ జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించిన బీఆర్ఎస్ నాయకులు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రూపాని యాదయ్య, రూపని లక్ష్మయ్య, మర్రి భద్రయ్య, బోయ స్వామి, రూపని నరసింహ, ఈదుల ప్రవీణ్, నరసింహ, యాదయ్య ,R.యాదయ్య, శ్రీను, రాంబాబు, రామకృష్ణ, స్వామి తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Feb 12 2024, 13:57

తెలంగాణలో గ్రూపు-1 ఎగ్జామ్ కు కొత్త నోటిఫికేషన్‌?

తెలంగాణలో గ్రూపు-1 కొత్త నోటిఫికేషన్‌కు క్లియర్ అయింది. గత నోటిఫికే షన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది

అయితే రాష్ట్రంలో తాజాగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కేసును ఉపసహించరిం చుకున్నది. దీంతో గ్రూపు-1 కొత్త నోటిఫికేషన్‌ వేసుకో వడానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మరోవైపు రాష్ట్రంలో గ్రూపు-1 పోస్టులను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విష యం తెలిసిందే. గతం లోని 503 ఖాళీలకు అదనంగా మరో 60 పోస్టులను పెంచు తూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 563 వరకూ ఉండే అవకాశం ఉంది. రాబోయే కొత్త నోటిఫికేషన్ పెంచిన పోస్టులతో కలిపి రానుంది.

పేపర్‌ లీకేజీ, ప్రశ్నల తప్పి దాల కారణంగా పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. కొత్త నోటిఫికేషన్‌ను విడు దల చేయాలని నిర్ణయిం చారు. ఇదే అంశాన్ని తాజాగా అసెంబ్లీలో సైతం ప్రకటించారు